Jump to content

జాజుల గౌరి

వికీపీడియా నుండి
జాజుల గౌరి
జననంమునింగం సుశీల
(1969-03-02) 1969 మార్చి 2 (వయసు 55)
లోతుకుంట,హైదరాబాదు,
తెలంగాణ India
నివాస ప్రాంతంహైదరాబాదు
భార్య / భర్తమునింగం నాగరాజు
పిల్లలువసంత పల్లవి,
మహేష్ కుమార్,
లేఖక్ సిద్ధార్థ
తండ్రిమల్లయ్య
తల్లిలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా 2015, జూన్ 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో 400 మంది కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో మామిడి హరికృష్ణ నుండి సత్కారం అందుకుంటున్న జాజుల గౌరి

జాజుల గౌరి పేరుపొందిన దళితవాద రచయిత్రి. ఈమె అసలు పేరు మునింగం సుశీల. ఈమె హైదరాబాదు లోతుకుంటలో 1969 మార్చి 2న మల్లయ్య, లక్ష్మి దంపతులకు జన్మించింది.[1] ఈమె 8వ తరగతి చదివే సమయంలో మునింగం నాగరాజుతో వివాహం జరగడంతో చదువు ఆగిపోయింది. తరువాత ఈమె డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. డిగ్రీ సంపాదించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదివింది. ఈమె బాల్యం నుండే పాటలు వినడంలోను కవిత్వం వ్రాయడంలోను ఆసక్తి చూపింది. ఈమె మొదటి కవిత 1980లో కర్షకులు పేరుతో తన తల్లిదండ్రులను ఉద్దేశించి వ్రాసింది. అది మొదలుకొని ఈమె బాల కార్మికుల గురించి, పేదరికం గురించి సుమారు 300 కవితలు వ్రాసింది. ఆ కవితలు ప్రచురించడానికి పత్రికలు తిరస్కరించడంతో ఆమె దళిత దృక్కోణంలో కవిత్వం వ్రాయడం ప్రారంభించింది. ఈమె కవిత్వం ఆంధ్ర రాష్ట్రంలో దళితోద్యమం బలపడటానికి దోహదపడింది. ఈమె తెలంగాణ ప్రాంతం నుండి తొలి తరం దళిత రచయిత్రిగా వాసికెక్కింది.[2]

జాజుల గౌరి జీవితం, సాహిత్యం వేరుకాదు. తాను గడిచివచ్చిన జీవితాన్ని సాహిత్యంలో చిత్రిస్తున్నది. తెలుగుసాహిత్యంలో మాదిగ దండోరా ఉద్యమ నేపథ్యంలో తనను తాను తెలుసుకుంటూ తమ జీవితాలు కూడా సాహిత్య యోగ్యమే అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న రచయిత్రి ఈమె. ఈమె ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. దళిత బహుజన సామాజిక ఉద్యమాలలో ముఖ్యంగా స్త్రీ సమస్యలపై పోరాడే ఉద్యమాలలో ఈమె చురుకుగా పాల్గొంటున్నది.

జీవిత సంగ్రహం

[మార్చు]

జాజుల గౌరి సికింద్రబాద్ లోని బొల్లారం దవఖానాలో జన్మిచినది, అమ్మ జాజుల లక్ష్మమ్మ. 1930 ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని కీసర నుంచి వచ్చి అల్వాల్ లోని వ్యవసాయ భూముల్లో మాదిగతనం చేస్తూ స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎనిమిది ఎకరాల బీడు భూమిని లోతు కుంటలో సాగు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు.[3]

రచనలు

[మార్చు]
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న జాజుల గౌరి
  • మన్నుబువ్వ (కథల సంపుటి)
  • వొయినం (నవల)

పురస్కారాలు

[మార్చు]
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న జాజుల గౌరి

జాజుల గౌరి కథా రచయిత్రిగా అనేక పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నది. కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు, గుడివాడ, హైదరాబాదు తదితర ప్రాంతాలలో నిర్వహించిన సాహిత్య సభలలో రచయిత్రిగా ఆహ్వానించబడింది.

ఈమె అందుకున్న పురస్కారాలు కొన్ని:

  • మన్నుబువ్వ కథల సంపుటికి విశాల సాహితి పురస్కారం.
  • సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం.
  • మన్నుబువ్వ పుస్తకానికి చాసో పురస్కారం.
  • అధికార భాషాసంఘం అవార్డ్
  • తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2013, 13 జూలై 2016 (వొయినం పుస్తకానికి)[4][5]
  • యద్దనపూడి సులోచనారాణి మాతృమూర్తి పురస్కారం.
  • రంగవల్లి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారం.
  • దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి వీరాంగన సావిత్రీబాయి ఫూలే పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. కథానిలయంలో జాజుల గౌరి వివరాలు
  2. Thummapudi, Bharathi (2008). A History of Telugu Dalit Literature (1 ed.). Delhi: KALPAZ PUBLICATIONS. pp. 169–171. ISBN 81-7835-688-0.
  3. "Vanga yashoda – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-05-30. Retrieved 2024-03-20.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  5. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.